ఇవీ చదవండి:
భగీరథ పైపు ఎంత పనిచేసింది.. 7 ఎకరాల ధాన్యం నీటిపాలైంది.. - మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ
Mission Bhagiratha pipeline leakage: మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ కావడంతో.. చేతికొచ్చిన 7ఎకరాల పంట నీటి పాలైంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేటకు చెందిన కౌలు రైతు రాగం మల్లేశ్.. 7 ఎకరాల ధాన్యాన్ని జాతీయ రహదారి వెంట ఆరబోశాడు. ఆదివారం అర్ధరాత్రి మిషన్ భగీరథ పైపులైన్ లీకై.. ధాన్యమంతా కొట్టుకుపోయి తడిసిముద్దయింది. ఒక్క గింజ చేతికిరాలేదని సుమారు రూ.5 లక్షలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోతున్నాడు. రెండు లక్షల రూపాయలు అప్పు చేసి పంట సాగు చేశానని.. ప్రస్తుతం అప్పు తీర్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
pipeline leakage
ఇవీ చదవండి: