వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్ జలాశయం నుంచి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి నీటిని విడుదల చేశారు. గతేడాది డిసెంబర్ 31న తెగిపోయిన సరళాసాగర్ ప్రాజెక్టు విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఈ వానాకాలం రైతులకు సాగునీటిని అందించాలనే సంకల్పంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు.
వర్షాకాలం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ప్రాజెక్టును తక్కువ సమయంలోనే పూర్వవైభవం తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి... ప్రతిపక్షాలకు కనిపించక అనవసరంగా ఆరోపిస్తారని ఆల వెంకటేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఎవ్వరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. సీఎం బంగారు తెలంగాణకు కృషి చేస్తారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట 40 మందికి టోకరా