వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం, రామనాథపురం గ్రామాల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ భాషా పర్యటించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. కరోనా సోకకుండా జాగ్రత్త వహించాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల వైరస్ బారిన పడకుండా ఉండగలమని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానంతో రైతులు అధిక దిగుబడి పొందవచ్చని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. వానాకాలంలో మొక్కజొన్న వేయవద్దని, సన్నరకం వడ్లు వేయాలని సూచించారు. డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద 47 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
- ఇవీ చూడండి: తీరాన్ని తాకిన నిసర్గ తుపాను.. గాలుల బీభత్సం