వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్, మదనాపురం, నాగవరం ప్రాంతాల్లో కలెక్టర్ యాస్మిన్ బాష పర్యటించారు. ఆరో విడత హరితహారంలో భాగంగా ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. అనంతరం నర్సరీ, డంపింగ్ యార్డ్, వైకుంఠదామాన్ని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 47.63 లక్షల మొక్కలను పెంచనున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా పట్టణానికి లక్ష మొక్కలు ఇచ్చినట్టు తెలిపారు.
మున్సిపల్ అధికారుల పనితీరు పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ తమ బాధ్యతను నిర్వహిస్తూ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గాయత్రి, మున్సిపల్ కమిషనర్ కృష్ణయ్య పాల్గొన్నారు.