జిల్లా వాప్తంగా 16 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వనపర్తి కలెక్టర్ యాస్మిన్ బాష స్పష్టం చేశారు. జిల్లాలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని ఆమె సూచించారు. ఈరోజు జిల్లా ఆస్పత్రిలో ఆమె కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
జిల్లా పరిధిలో రోజు రోజుకు వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తిస్తోందని జిల్లా పాలనాధికారి అన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న ప్రజలకు మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. టీకా తీసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. సెలవు రోజుల్లోనూ ప్రతి కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కూడా కరోనా టీకా తీసుకున్నారు.