వనపర్తి జిల్లాలో పారిశుద్ధ్యంపై 15 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా పలు వార్డుల్లో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పర్యటించారు. మురుగు కాలువలలో నీరు నిల్వ ఉండకుండా నీటి ప్రవాహం ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సానిటేషన్ మంచిగా మెయింటైన్ చేయాలని... పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. కాలనీల్లోని పందులను దూరప్రాంతాలకు తక్షణమే తరలించాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: కేసీఆర్ సభకు మరోసారి వరణుడి అడ్డంకి