వనపర్తి జిల్లాలో పర్యటించిన పాలనాధికారి శ్వేతా మహంతి... కనిమెట్ట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటారు. గ్రామంలోని పలు కాలనీలను పరిశీలించారు. ఇళ్ల నుంచి మురుగునీరు బయటకు వదలడం గమనించారు. అలా చేసిన వారికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. నీటిని ఎక్కువ కాలం నిల్వ చేయకూడదని హెచ్చరించారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామస్థులంతా అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
- ఇదీ చూడండి : బతికున్న వ్యక్తికి శవయాత్ర- కారణం అద్భుతం!