ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ శ్వేతామహంతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆసుపత్రి సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హేండ్రీ డ్యూనాన్ట్ చిత్రపటానికి పూలమాలవేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆమె జిల్లా ఆస్పత్రిలోని ప్రసూతి విభాగాన్ని సందర్శించారు. ప్రసూతి కోసం ఆసుపత్రికి వచ్చిన వారిని బయటకు ఎందుకు పంపుతున్నారుని ఆ విభాగం అధిపతిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ముగిసిన రెండో విడత స్థానిక ఎన్నికల ప్రచారం