ETV Bharat / state

'సమస్యలు పరిష్కరించరా? ఐతే.. తాళం తీసేది లేదు'

వనపర్తి జిల్లా చిన్నమారుర్​లో గ్రామ సమస్యలు పరిష్కరించడం లేదంటూ... సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్, వార్డు సభ్యులను గ్రామస్థులు  గ్రామపంచాయతీలో నిర్బంధించారు.

తాళం తీసేది లేదు
author img

By

Published : Sep 25, 2019, 6:24 PM IST

గ్రామ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ... సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్, వార్డు సభ్యులను గ్రామస్థులు గ్రామపంచాయతీలో నిర్బంధించిన ఘటన వనపర్తి జిల్లా చిన్నమారుర్​లో చోటుచేసుకుంది. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి రోగాలబారిన పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్, వార్డు సభ్యులను గ్రామపంచాయతీలో నిర్బంధించి తాళం వేశారు. కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అధికారులు వచ్చే వరకు తాళం తీసేది లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక ఎక్కడ పోయిందని గ్రామస్థులు అధికారులను నిలదీశారు. పోలీసులు వచ్చినా.. తాళం తీయకుండా అడ్డుకున్నారు. పై అధికారులు వచ్చేంత వారని వదిలేదంటూ.. గ్రామపంచాయతీ ముందు గ్రామస్థులు కూర్చున్నారు.

ఇవీ చూడండి:ఆరుబయట మలవిసర్జన చేశారని చిన్నారుల్ని కొట్టి చంపారు!

Tg_mbnr_16_25_adikaarlu_nirbandam_av_ts10097 మా గ్రామ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు సర్పంచ్, స్పెషల్ ఆఫీస్, వార్డు సభ్యులను గ్రామపంచాయితిలో నిర్బంధించారు. వనపర్తి జిల్లా చిన్నాంబావి మండలం చిన్నమారుర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ ను, స్పెషల్ ఆఫీసర్ ను, వార్డు సభ్యులను గ్రామస్తులు గ్రామపంచాయితిలో నిర్బంధించారు. మా గ్రామంలో సమస్యల వలన మేము రోగలబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్, వార్డు సభ్యులను గ్రామపంచాయితి లో వేసి తాళం వేశారు. గ్రామపంచాయతీ ముందు కూర్చొని ఆందోళన చేశారు. అధికారులు వచ్చే వరకు తాళం తీసేందే లేదాన్ని గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎస్సీ కాలనీలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరి పాములు, తేళ్లు వస్తుయాన్ని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక ఎక్కడ పోయిందని గ్రామస్తుల అధికారులను నిలదీశారు. ఎస్సీ కాలనీలో బోధకాలు, డెంగ్యూ, మల్లేరియా, టైపాడు లాంటి విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో, కాలనీలో సమస్యలను దగ్గర ఉండి గ్రామస్తులు చూపించారు. చిన్న పిల్లలకు, పెద్ద వారికి రోగాలబారిన పడ్డారని గ్రామస్తులు ఆరోపించారు. పోలీసులు వచ్చిన తాళం తీయకుండా అడ్డుకున్నారు. పై అధికారులు వచ్చేంత వరకు తీయడం కుదరదుంటు గ్రామపంచాయతీ ముందు గ్రామస్తులు కూర్చున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.