ETV Bharat / state

కేంద్ర బడ్జెట్‌తో ఎక్కువ వర్గాలకు మేలు - అసంఘటిత కార్మికులు

తొలిసారి పూర్తిస్థాయి మహిళా ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో సంక్షేమం, నిర్మాణాత్మక అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా వరాలు ప్రకటించకపోయినా కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో కార్మికులు, చిరు వర్తకులు, రైతులు, మహిళలు, మత్స్యకారులు, గిరిజనులు, యువత.. ఇలా అనేక వర్గాలకు మేలు జరగనుంది.

కేంద్ర బడ్జెట్‌తో ఎక్కువ వర్గాలకు మేలు
author img

By

Published : Jul 6, 2019, 11:14 AM IST

ఎన్నో ఏళ్ల నుంచి పాలమూరు ప్రజలు పలు రైల్వే ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు. గద్వాల - మాచర్ల, వికారాబాద్‌ - కృష్ణా, జడ్చర్ల - నంద్యాల రైల్వే లైన్లను దశాబ్దాలుగా కోరుతున్నారు. వెనుకబడిన నాగర్‌కర్నూలు, నారాయణపేట జిల్లాలు అభివృద్ధి సాధించాలంటే ఈ రైల్వే లైన్లు ఎంతో అవసరం. ఈ ప్రాజెక్టులపై ఎలాంటి హామీ లభించకపోవడంతో దాదాపుగా వాటికి కేటాయింపులు లేనట్లే.

ts wanaparthy budget segments released
కేంద్ర బడ్జెట్‌తో ఎక్కువ వర్గాలకు మేలు

సైనిక్‌ పాఠశాలపై నీలినీడలు
నారాయణపేటలో సైనిక్‌ పాఠశాల కోసం స్థలం కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. ఈ బడ్జెట్‌లోనైనా సైనిక్‌ పాఠశాల ప్రస్తావన ఉంటుందని అందరూ భావించారు. దీని ప్రస్తావన లేకపోవడంతో సైనిక్‌ పాఠశాల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్రియ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల ఊసేలేదు. ఈ ఏడాది పాలమూరుకు ఎలాంటి విద్యాలయాలు రానట్లే.

పాలమూరుకు నిరాశే
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా లేదా ప్రత్యేక నిధులు కావాలని ప్రభుత్వం కోరుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో 12,30,000 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకం నిధులు లేక నత్తనడకన సాగుతోంది. కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తే పనులు పరుగులు పెట్టే అవకాశం ఉండేది. ఈసారి ‘పాలమూరుకు’ నిరాశే ఎదురైంది.

అసంఘటిత కార్మికులకు ఆసరా
ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్‌ యోజన కింద 60 ఏళ్లు నిండిన అసంఘటిత కార్మికులకు రూ. 3వేలు పింఛను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నట్లు ఈ బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రతినెలా రూ. 100 చెల్లిస్తే ప్రభుత్వం అంతే మొత్తం చెల్లిస్తుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత కార్మికులకు పింఛను అందుతుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 17.89 లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని అంచనా. 3,30,076 మంది భవన నిర్మాణ కార్మికులు, 25వేల మంది బీడీ కార్మికులు, 12,500 మంది చేనేత కార్మికులు, 9 లక్షల వ్యవసాయ కూలీలు, ఇతర రంగాల్లో 5.20 లక్షల మంది కార్మికులు ఉన్నారు.

చిల్లర వర్తకులకు చేయూత
సూపర్‌ మార్కెట్లు, షాపింగ్‌ మాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిల్లర వర్తకులకు ఊరట లభించింది. ప్రధానమంత్రి కర్మయోగి మాన్‌ధన్‌ యోజన ద్వారా చిల్లర వర్తకులకు కేంద్రం పింఛను సౌకర్యం తీసుకురానుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 50వేల మంది చిల్లర వర్తకులు ఉన్నారు. అందులో వార్షిక టోర్నవర్‌ 1.5 కోట్లలోపు ఉన్న వాళ్లందరికీ పింఛను సౌకర్యం సమకూరనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోని సుమారు 35వేల మందికి పైగా చిల్లర వర్తకులు దీనికి అర్హత సాధించే అవకాశం ఉంది.

ఇక మహిళలకూ ముద్ర రుణాలు
తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్‌ అతివలకు పెద్దపీట వేశారు. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులైన మహిళలకు ముద్ర రుణాలను అందించనున్నట్లు ప్రకటించారు. మహిళాల్లో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించడానికి, స్వయంఉపాధితో ఆర్థిక సాధికారత సాధించేందుకు ముద్ర రుణంగా రూ. లక్ష అందించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 58వేల స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. 6,30,000 మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికి జన్‌ధన్‌ ఖాతాతోపాటు రూ. 5000 ఓవర్‌ డ్రాఫ్ట్‌(ఓడీ) సౌలభ్యం దక్కనుంది. వీరు తమ అవసరాలకు ఎప్పుడంటే అప్పుడు ఓడీ కింద రూ. 5వేల వరకు ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవచ్చు.

కట్టెల పొయ్యి కష్టాలు దూరం
ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన కింద మహిళలకు మరో 8 కోట్ల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2018 ఏప్రిల్‌ 20న కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మహిళలకు ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్లు అందించనుంది. ఉమ్మడి జిల్లాలో 8,04,070 కుటుంబాలు ఉన్నాయి. అందులో 7.10 లక్షల కుటుంబాలకు ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. మరో 90వేల కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు అందాల్సి ఉంది. పాలమూరులోని గూడేలు, తండాలు, గ్రామాల్లో మహిళలు ఇప్పటికీ కట్టెలపొయ్యిపైనే వంట చేస్తున్నారు. వీరందరి కష్టాలు దూరం కానున్నాయి.

సొంతింటి కల సాకారానికి దారి
మధ్య తరగతి ప్రజలు సొంతింటిని నిర్మించుకోవాలంటే బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాల్సిందే. నెలనెలా ఈఎంఐ చెల్లించడానికే జీతం డబ్బులు సరిపోతున్నాయి. రూ. 45 లక్షలలోపు గృహరుణాలపై రూ. 1.50 లక్షల వరకు వడ్డీ తగ్గింపు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవారికి రూ. 2 లక్షల నుంచి రూ. 3.50 లక్షల వడ్డీ రాయితీని ప్రకటించింది. ఇది ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలకు ఊరట కానుంది. ఏటా ఉమ్మడి జిల్లాలో సుమారు 25వేల మంది గృహరుణాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం వీరికి ఊరట కలిగించనుంది.

ఖర్చు లేని వ్యవసాయ విధానం
పెట్టుబడి పెరగటం వల్లనే రైతులకు నష్టాలు వస్తున్నాయని భావిస్తున్న కేంద్రం దీన్ని తగ్గించాలని సంకల్పించింది. విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు కొనుగోలు చేయకుండానే ఎలా వ్యవసాయం చేయవచ్చో రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీలో భాగంగా దీన్ని అమలు చేయనున్నారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో 3,34,957, జోగులాంబ గద్వాల జిల్లాలో 1,48,512, నాగర్‌కర్నూలు జిల్లాలో 2,63,125, వనపర్తి జిల్లాలో 1,52,025 మంది రైతులు ఉన్నారు.

వేతన జీవులకు ఊరట
ఆదాయపు పన్ను మినహాయింపును రూ. 5 లక్షల వరకు పేర్కొంది. ఉమ్మడి పాలమూరులో ప్రభుత్వ శాఖల్లో 31వేల మంది, ప్రైవేటు సెక్టారులో 36వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో వార్షిక ఆదాయం రూ. 5 లక్షలలోపు ఉన్నవారు సుమారు 70 శాతానికి పైగానే ఉన్నారు. వీరికి వృత్తిపన్ను నుంచి ప్రభుత్వం ఊరట కలిగించింది.

పాలమూరుకు జలశక్తి
దేశవ్యాప్తంగా 256 జిల్లాలకు జలశక్తి అభియాన్‌ను విస్తరించినట్లు బడ్జెట్‌లో కేంద్రం పేర్కొంది. దీని ద్వారా గ్రామాల్లో భూగర్భ జలాలను పెంపొందించవచ్చు. ఉమ్మడి పాలమూరులోని బాలానగర్‌, హన్వాడ, మిడ్జిల్‌, నర్వ, గోపాల్‌పేట, తాడూరు, వెల్దండ మండలాల్లోని 261 పంచాయతీల్లో జలశక్తి అభియాన్‌ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా చెక్‌డ్యాంలు, ఊటకుంటలు, నీటికుంటలు, సేద్యపు కుంటలు, ఇంకుడు గుంతలు, కందకాలను ఏర్పాటు చేసి వాననీటిని సంరక్షిస్తారు.

పరిశ్రమల ఏర్పాటుకు ఊతం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. కోటి వరకు రుణాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,500 మందికి పైగా వివిధ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రధానంగా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోసం యువత ఎక్కువగా ముందుకు వస్తుంది. కేంద్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తుండడంతో పాలమూరు యువతకు ఊపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.

అడవి బిడ్డలకు అండ
ఆదివాసీ, గిరిజన చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రం పేర్కొంది. ఆ ప్రాంతాల చరిత్రను డిజిటల్‌ రూపంలో భద్రపరుస్తామని వెల్లడించింది. ఐటీడీఏ పరిధి అచ్చంపేట, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లో నల్లమల్ల అడవుల్లో 12వేలకు పైగా గిరిజనులు ఉంటారు. వారికి ప్రత్యేక చరిత్ర ఉంది. కట్టు, బొట్టు వైవిధ్యంగా ఉంటుంది. ఏటా బౌరపురంలో భ్రమరాంబ ఉత్సవాలు పెద్దఎత్తున నిర్వహిస్తారు. వారి సంస్కృతికి వైభవం రానుంది.

మత్స్యకారులకు రుణ సాయం
కేంద్రం మత్స్యకారుల కోసం బడ్జెట్లో మత్స్య సంపద యోజనను ప్రవేశపెట్టింది. ఉమ్మడి జిల్లాలోని 50వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్రం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించాలని నిర్ణయించింది. మత్స్యకారులకు ఇచ్చే రుణంలో 2 శాతం రాయితీ పొందవచ్చు. అదేవిధంగా ఆ రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే, అదనంగా మరో 3 శాతం రాయితీ వస్తుంది.

ఇదీ చూడండి : పెట్రోల్​ ధర మళ్లీ పెరిగింది బాబోయ్​..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.