బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్ బస్సు 44వ నెంబర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విలియం కొండ వద్ద జరిగింది. 30 మంది ప్రయాణికులతో కావేరి ట్రావెల్స్ బస్సు విలియం కొండ వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను మరో బస్సులో పంపించారు.
రహదారికి అడ్డంగా పడిన బస్సు
పక్కనే ఉన్న ఏనుగుంట శ్రీరంగాపురం కాలువలో బస్సు పడి ఉంటే ఊహకు అందని పెను ప్రమాదం జరిగి ఉండేది. రహదారికి అడ్డంగా బస్సు పడిపోవడంతో కర్నూల్, హైదరాబాద్ రహదారిపై గంటసేపు వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలను దారి మళ్లించి క్రమబద్ధీకరించారు.
ఇవీ చూడండి: జొన్నలగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం