ETV Bharat / state

విధి వంచిత కుటుంబం.. వృద్ధాప్యంలో తండ్రి పోరాటం - వనపర్తి జిల్లాలో ఓ కుటుంబానికి అనారోగ్యం

కుటుంబంలో ఏ చిన్నకష్టం వచ్చినా తండ్రి అల్లాడుపోతాడు. ఆ బాధ తీర్చేందుకు సర్వశక్తులొడ్డుతాడు. కానీ ఇంట్లోవారందరూ కళ్లెదుటే భరించలేని వేదన అనుభవిస్తుంటే... ఆ తండ్రి అనుభవించే శోకం అంతా ఇంతా కాదు. పుట్టుకతోనే అంధురాలైన కుమార్తె... ప్రమాదంలో కాళ్లు, చేతులు పోగొట్టుకున్న కుమారుడు. పక్షవాతంతో మంచాన పడ్డ భార్య. ఇలా... ఉప్పెనలా వచ్చి పడ్డ కష్టాల కడలికి ఎదురీదుతున్నాడు... ఓ వృద్ధుడు. విధిని ఎదిరించలేక... కమ్ముకున్న కష్టాల నుంచి తప్పించుకోలేక దీనస్థితిలో గడుపుడున్న ఓ వృద్ధ తండ్రి విషాద గాథపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

wanaparthy district
wanaparthy district
author img

By

Published : Jan 31, 2021, 6:39 PM IST

కన్నీటి గాథ... కుటుంబాన్ని బతికించేందుకు ఓ తండ్రి వ్యథ

వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌కు చెందిన యూసుఫ్, జహీరాబీ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. యూసుఫ్ సంతలో మిఠాయిలు అమ్ముతూ, అప్పడుప్పుడూ వంటలు చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవారు. ఇలా ఇద్దరు కుమారులు, పెద్దకుమార్తెకు వివాహం చేశారు. చిన్నకూతురు పర్వీనాబేగం బాల్యంలోనే కంటిచూపు కోల్పోగా... ఆమెకు చూపు రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తల్లిదండ్రులుంటే తప్ప ఆమె జీవనం గడవదు. చిన్నకుమారుడు లతీఫ్ తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. భవిష్యత్తులో తమకు అండగా ఉంటాడనుకుని తల్లిదండ్రులు భావించినా... ఆ ఆశ ఎంతో కాలం నిల్వలేదు.

వాళ్ల శోకం వర్ణణాతీతం

2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో లతీఫ్ కాళ్లూ చేతులూ చచ్చుబడిపోయాయి. కుమారున్ని బాగుచేయించేందుకు ఉన్న డబ్బంతా ఖర్చు చేశారు. కర్నూల్​లో ఇంటి స్థలాన్ని అమ్మేశారు. అయినా ఫలితం లేకపోయింది. డబ్బుల్లేక వైద్యం నిలిపివేశారు. పదేళ్లుగా లతీఫ్ మంచానికే పరిమితమయ్యారు. కదల్లేరు, మెదల్లేరు. అన్నిసపర్యలూ తల్లిదండ్రులు చేయాల్సిందే. చేతికందొచ్చిన బిడ్డ... కుప్పుకూలి పోవడంతో తల్లిదండ్రులిద్దరి శోకం వర్ణణాతీతంగా మారింది.

మరో పిడుగు

అప్పటికే ఊహించని కష్టాలను ఎదురీదుతూ వస్తున్న ఆ కుటుంబంపై లాక్​డౌన్ సమయంలో మరో పిడుగు పడింది. యూసుఫ్‌కు అన్నివేళల్లో అండగా ఉంటూ.. బిడ్డల బాగోగులు చూసుకుంటున్న భార్య జహీరాబీ ఒక్కసారిగా పక్షవాతానికి గురైంది. ఇన్నేళ్లు కుటుంబానికి అన్నీతానై సేవలు చేసిన జహీరాబీకి ఇప్పుడు ఇంకొకరు సపర్యలు చేస్తే తప్ప గడపలేని పరిస్థితి. ఇన్నేళ్లు జహీరాబీ పిల్లల్ని చూసుకుంటుంటే... యూసుఫ్​ ఎంతో కొంత సంపాదించి తీసుకొచ్చేవాడు. ఇప్పుడామె కూడా అనారోగ్యానికి గురవటంతో... ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. మంచానికే పరిమితమైన లతీఫ్​కు తండ్రి సేవలు చేస్తుండగా... తల్లికూతుళ్లకు అత్తారింటి నుంచి వచ్చిన పెద్దకూతురు సపర్యలు చేస్తోంది.

దాతలు సాయం చేస్తే..

70 ఏళ్లున్న యూసుఫ్‌ను ఆస్తమా వేధిస్తోంది. కొవిడ్ కారణంగా మిఠాయి అమ్మకాలు తగ్గిపోగా... పనికూడా దొరక్క పూట గడవడమే గగనమైంది. రేషన్ బియ్యం, పింఛను డబ్బులతో అతికష్టం మీద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. యూసుఫ్​కు అస్తమా, జహీరాబీకి పక్షవాతం, లతీఫ్ మంచానికే పరిమితం. ఈ ముగ్గురికీ ప్రతినెల వైద్యఖర్చులు మందుల కోసమే కనీసంగా 20వేల వరకూ ఖర్చవుతాయి. అంధురాలైన పర్వీనా బేగం క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంది. కానీ అంత సంపాదన ఆ కుటుంబానికి లేదు. దీంతో వారి కుటుంబం మనుగడ దినదిన గండంగా మారింది. ఫిజియో థెరపీ చేయిస్తే.. లతీఫ్ ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంది. సరైన వైద్యం అందిస్తే జహీరాబీ కూడా కోలుకునే అవకాశాలున్నాయి. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే తప్ప యూసుఫ్ కుటుంబం మనుగడ సాగించలేని పరిస్థితి నెలకొంది.

సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయడమే నిజమైన మానవత్వం. అలాంటి సాయం కోసమే ఆశగా ఎదురుచూస్తోంది యూసుఫ్ కుటుంబం.

ఇదీ చదవండి : చేతులు లేకున్నా.. కాళ్లతో రాస్తూ ఇంటర్​లో టాపర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.