వనపర్తి పట్టణంలోని పలు కాలనీల్లో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష పర్యటించారు. అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కాలనీవాసుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇతర జిల్లాల్లో సర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని... వనపర్తిలో అధికారులు ఇంకా పాత పద్ధతిలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని సర్వే పనులను వీలైనంత వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ క్రమంలో ఆస్తులకు సంబంధించి యజమానులకు ఎలాంటి అనుమానాలు వచ్చిన వెంటనే నివృత్తి చేయాలన్నారు. గుర్తించిన స్థిరాస్తులకు సంబంధించి మెరూన్ కలర్ పాస్‌పుస్తకాలను సూత్రప్రాయంగా జారీ చేయాలని అధికారులకు తెలిపారు.
ఇదీ చూడండి: ఆస్తుల విలువ నిర్ధారణ గడువులోగా పూర్తవుతుందా.. ?