ETV Bharat / state

కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం - kothakota

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసి పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

అకాల వర్షం... అపార నష్టం
author img

By

Published : Apr 23, 2019, 1:25 PM IST

వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని చర్లపల్లి, అప్పరాల, మదనాపురం మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. సుమారు 3 వేల బస్తాలతో పాటు రైతులకు చెందిన మరో వెయ్యి బస్తాలు తడిసిపోయాయి. కేంద్రాల్లో ధాన్యంపై కప్పడానికి కవర్లు లేని కారణంగా నీటిలో వరి కొట్టుకు పోయింది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

అకాల వర్షం... అపార నష్టం

ఇవీ చూడండి: భాగ్యనగరంలో ఈదురు గాలులకు నేలకూలిన చెట్లు

TG_MBNR_12_22_THADICHINA_DHANYAM_AV_C5 సెంటర్.కొత్తకోట, వనపర్తి జిల్లా. పేరు. బి.చంద్రశేఖర్ రెడ్డి. ( ) ఈదురు గాలులు అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని చర్లపల్లి , అప్పరాల, మదనాపురం మండలం లోని అజ్జకొల్లు మదనాపురంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రంలో ఉన్న సుమారు 3 వేల బస్తాలు తో పాటు రైతులకు చెందిన మరో వెయ్యి బస్తాలు వర్షానికి తడిసిపోయాయి. వర్షం నీటిలో వరి ధాన్యం కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై కప్పడానికి కవర్లు లేకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిచింది .తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించుకుపోవడంతో తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కొరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సదుపాయాలను రైతులకు అందుబాటులో ఉంచాలని, కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తరలించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. ఇప్పటికే వర్షాలు లేక పంటలు ఎండిపోయాని, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఇప్పుడు వర్షానికి తడిచిపోతే దిక్కు ఎవ్వరిని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.