ప్రాదేశిక ఎన్నికల నామ పత్రాల దాఖలుకు చివరి ఘట్టం ముగిసింది. వనపర్తి జిల్లాలో పెద్దమందడి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాల్లో రెండో విడత నామినేషన్లు పూర్తయ్యాయి. రెండో విడత ఆఖరి రోజున వనపర్తి జిల్లాలో 5 జడ్పీటీసీ స్థానాలకు 21 నామ పత్రాలు, 43 ఎంపీటీసీ స్థానాలకు 129 నామినేషన్లు సమర్పించారు. నామ పత్రాల సమర్పణకు చివరి రోజు సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు నామ పత్రాలు స్వీకరించారు.
ఇవీ చూడండి : జోరుగా రెండో దశ నామినేషన్లు