మాయదారి కరోనా మహమ్మారికి మనోబలమే అసలైన మందు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాను సందర్శించారు. కొవిడ్ రోగులకు ధైర్యాన్ని అందించారు. కరోనా రోగులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించిందని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తోందని వివరించారు.
నిరుపేదలకు అండగా ఉండటమే ముఖ్యమంత్రి లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారని చెప్పారు. వివిధ అనారోగ్యాల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన జిల్లా పరిధిలోని 57 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. నిరుపేదలు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
- ఇదీ చదవండి బోసిపోతున్న భాగ్యనగర పర్యాటక ప్రాంతాలు