మార్పు తీసుకొచ్చారిలా
వనపర్తిలో చాణక్య పాఠశాల యాజమాన్యం ఇచ్చిన ఆలోచనతో విద్యార్థులు అందరిలో మార్పుకు శ్రీకారం చుట్టారు. ఒక్కో ఇంటి నుంచి బట్టతో కుట్టిన మూడు బ్యాగులను తయారు చేసి ఒకటి ఇంట్లోనే ఉంచి రెండు చుట్టపక్కల ఇళ్లలో పంచారు. ఇకపై ప్లాస్టిక్ సంచులు వాడకుండా వీటినే ఉపయోగించేలా అవగాహన కల్పిస్తున్నారు. వాటర్ ప్యాకెట్లు కాకుండా రాగి, స్టీల్ సీసాలను వాడుకోవాలని సూచించారు.
విద్యార్థులు చేపట్టిన కార్యక్రమం అందరినీ అబ్బురపరుస్తోంది. ఇకపై ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తామని స్థానికులు తెలిపారు. సర్కారు వీటిని రద్దు చేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి :హెచ్ఐవీ మాయం!