వనపర్తి జిల్లాలోని కొత్తకోట పట్టణ కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకృష్ణుని ప్రతిమను కొత్తకోటలోని వీధులలో ఊరేగించారు. గోపిక, కృష్ణుల వేషధారణతో చిన్నారులు అలరించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో పాటు జడ్పీ వైస్ ఛైర్మన్ గౌడ్, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'భాజపా ట్రబుల్ షూటర్‌గా జైట్లీ ముద్ర ప్రత్యేకం'