ETV Bharat / state

వాటంతట అవే తెరుచుకున్నసరళాసాగర్​ జలాశయం గేట్లు - సరళాసాగర్​ జలాశయం

వనపర్తి జిల్లా మదనపురం మండలంలోని సరళాసాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. ప్రాజెక్టు సైఫన్​ గేట్లు వాటంతట అవే తెరుచుకున్నాయి. సిబ్బంది, యంత్రాలు, గేట్లు అవసరం లేకుండా ప్రాజెక్లు నిండినప్పుడు దానంతట అదే దిగువకు నీటిని విడుదల చేసుకోవడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.

saralasagar-cyphon-gates-opened-in-wanaparthy-district
వాటంతట అవే తెరుచుకున్నసరళాసాగర్​ జలాశయం గేట్లు
author img

By

Published : Aug 16, 2020, 8:09 AM IST

Updated : Aug 16, 2020, 9:38 AM IST

వనపర్తి జిల్లా మదనపురం మండలంలోని సరళాసాగర్ సైఫన్ గేట్లు తెరుచుకున్నాయి. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో ఈ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు సైఫన్లు వాటంతట అవే తెరుచుకుని దిగువకు నీటిని విడుదల చేస్తున్నాయి. రెండు ప్రీమింగ్ సైఫన్లు, 3 వుడ్ సైఫన్లు తెరచుకున్నాయి. ఆసియాలోనే ఆటోమాటిక్ సైఫన్ వ్యవస్థతో నడిచే ఏకైక ప్రాజెక్టు సరళసాగర్. ప్రపంచంలో ఇలాంటిది ఒక్క అమెరికాలోనే ఉంది. సిబ్బంది, యంత్రాలు, గేట్లు అవసరం లేకుండా ప్రాజెక్టు నిండినప్పుడు దానంతట అదే దిగువకు నీరు విడుదల చేసుకోవడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. వనపర్తి సంస్థానాధీశుడైన రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరిట ఈ ప్రాజెక్టును నిర్మింపజేశారు. 15 సెప్టెంబర్ 1949లో అప్పటి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్ జేఎన్ చౌదరీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 1959లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోగానే తొలుత ప్రైమింగ్ సైఫన్లు, తర్వాత వుడ్ సైఫన్లు స్వయంచాలితమై దిగువకు నీటిని విడుదల చేస్తాయి.

నీటి విడుదలకు ఎలాంటి మానవసాయం, యంత్ర సహకారం, విద్యుత్ అవసరం లేదు. నీటి మట్టం పెరుగుతున్న కొద్ది ఒకదానికి తర్వాత ఒకటి నాలుగు ప్రైమరీ సైఫన్లు, 17 వుడ్ సైఫన్లు వాటంతట అవే దిగువకు నీటిని విడుదల చేస్తాయి. నీటిమట్టం తగ్గగానే నీటి విడుదల సైతం దానంతట అదే ఆగిపోతుంది. ఇప్పటి వరకూ ఒక్కటి రెండు సార్లు మినహా ఎప్పుడూ సైఫన్ సిస్టం వినియోగం లోకి రాలేదు. 2009లో వరదలు వచ్చినప్పుడు పూర్తిస్థాయిలో పనిచేశాయి. ఎంతటి వరద వచ్చినా వేగంగా దిగువకు నీటిని విడుదల చేయడం సైఫన్ సిస్టం ప్రత్యేకత.

అయితే గత ఏడాది డిసెంబర్ 31న సరళాసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి ప్రధాన ఆనకట్ట తెగిపోయింది. దీంతో సరళాసాగర్ ఖాళీ అయింది. యుద్ధ ప్రాతిపదికన ఆనకట్ట నిర్మాణ పనులు చేపట్టిన తెలంగాణ సర్కారు.. ఆగస్టు నాటికి పనులు పూర్తి చేసి తిరిగి జలాశయాన్ని నింపింది. ఇటీవలే మంత్రి నిరంజన్​రెడ్డి జలపూజ నిర్వహించి ఆయకట్టుకు నీరు కూడా విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు సరళాసాగర్ నిండటంతో ఇవాళ సైఫన్ సిస్టం స్వయం చాలితంగా గేట్లు తెరచుకుంది.

ఇవీ చూడండి: ఇవాళ, రేపు భారీ వర్షాలు..19న మరో అల్పపీడనం

Last Updated : Aug 16, 2020, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.