వనపర్తి జిల్లాలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని సరళసాగర్, రామన్‌పాడు జలాశయాలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. మదనాపురం మండలంలోని శంకరమ్మపేట సమీపంలో గల సరళసాగర్ జలాశయానికి వరద నీరు పోటెత్తగా.. ప్రాజెక్టుకున్న ఆటో సైఫన్స్, ఉడ్స్ వాటంతటవే తెరుచుకొని దిగువకు నీటిని విడుదల చేస్తున్నాయి.
భారీగా వరదనీటి చేరికతో సరళసాగర్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సరళసాగర్ నుంచి రామన్‌పాడు జలాశయానికి వరద నీరు చేరడం వల్ల అధికారులు ఐదు గేట్లు ఎత్తి ఊకచెట్టు వాగుకు నీటిని విడుదల చేశారు. ఫలితంగా ఈ వాగుపై ఇటీవల నిర్మించిన చెక్‌డ్యామ్‌లు నిండుకుండలా మారాయి.
ఇదీ చదవండి: 'కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయండి'