ETV Bharat / state

జీతాల కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ సిబ్బంది - pending salaries

రెండు నెలలుగా వేతనాలు రావడం లేదు. జీతం లేక ఇళ్లు గడవడం కష్టమైంది. ఈనెల ప్రారంభమై 2 వారాలు గడుస్తున్నా... వేతనాలు ఇవ్వకపోవడంతో... మహబూబ్​నగర్​లో ఆర్టీసీ సిబ్బంది అంతా ఆందోళన బాట పట్టారు. ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని ఒప్పందం ఉన్నప్పటికీ... యాజమాన్యం ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు.

జీతాల కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ సిబ్బంది
author img

By

Published : Aug 14, 2019, 7:00 PM IST

Updated : Aug 14, 2019, 11:15 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో తొమ్మిది డిపోల పరిధిలో నాలుగు వేల 290మంది ఉద్యోగ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు 8కోట్ల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే యాజమాన్యం రెండు మాసాలుగా సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. దీనితో ఇళ్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం తక్షణమే స్పందించి వేతనాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం:
తమకు ప్రతినెల సకాలంలో అందాల్సిన వేతనాల కోసం ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి దినం రాలేదని... ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు.

జీతాల కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ సిబ్బంది
ఆందోళన ఉద్ధృతమే: ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని... లేనిపక్షంలో బస్సులను నిలిపివేసి సమ్మేబాట పడుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆర్టీసీపై ప్రత్యేక దృష్టి సారించి కార్మికులకు నెలసరి వేతనాలు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు.ఇదీ చూడండి: వెంటనే గుత్తేదార్లకు బిల్లులు చెల్లించాలి: కోమటిరెడ్డి

Intro:Tg_adb_22_24_cisf hareta haram_avb_TS10081Body:సీఐఎస్ఎఫ్ పోలీసుల హరితహారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లో సింగరేణి సిఐఎస్ఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సింగరేణి విభాగం బెటాలియన్ కమాండెంట్ కార్తికేయన్ డిప్యూటీ కమాండెంట్ రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో 65 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది రహదారి పక్కన రామకృష్ణాపూర్ ఉపరితల గని సమీపంలో గుంతలు తవ్వి 300 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్తికేయం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం లో తాము కూడా భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తిని మున్ముందు కూడా కొనసాగిస్తామని తెలిపారు. బైట. కార్తికేయ కమాండెంట్Conclusion:పేరు సతీష్ కుమార్ జిల్లా మంచిర్యాల , నియోజకవర్గం చెన్నూర్ఫో , ఫోన్ నెంబర్ 9440233831
Last Updated : Aug 14, 2019, 11:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.