వనపర్తి జిల్లా మదనాపురం మండలం అగ్రహారం సమీపంలోని మైసమ్మ గుడి వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఘటనలో ఐదుగురికి గాయాలవ్వగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆత్మకూరు నుంచి వడ్డెవాట గ్రామానికి వెళ్తున్న ఆటో.. వనపర్తి నుంచి ఆత్మకూర్ వెళ్తున్న బస్సు అగ్రహారం వద్ద ఢీకొన్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- ఇదీ చూడండి : మద్యం దుకాణం వద్దని మహిళల పోరు