గత రెండు రోజుల క్రితం వనపర్తిలో పట్టుబడిన లారీ రేషన్ బియ్యం విషయంపై పానగల్ మండల కేంద్రంలోని పరమేశ్వర రైస్ మిల్లును జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ ఆకస్మిక తనిఖీ చేశారు. మిల్లులో పరిశీలించగా ఇసాన్ ట్రేడర్స్కు సంబంధించిన 486 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అనుమతి లేకుండా ఒక మిల్లుకు సంబంధించిన బియ్యం మరొక మిల్లులు ఉండడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
సీఎంఆర్కు సంబంధించిన గోదాంలోని ప్రైవేట్ కోళ్ల షెడ్లో ఉన్న ధాన్యం బస్తాలను సీజ్ చేసి దానిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. మిల్లు యజమాని పరమేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. నెలల వ్యవధిలోనే 700 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడి.. కేసులు నమోదైనా అక్రమ వ్యాపారం ఆగడం లేదని.. బాధితులపై పీడీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు