ETV Bharat / state

వివాదాస్పదంగా పులిగుట్ట మైనింగ్ లీజు వ్యవహారం

Puligutta Mining Lease controversy : వనపర్తి జిల్లా అమడబాకులలోని పులిగుట్టపై మైనింగ్ లీజు వివాదాస్పదమవుతోంది. పక్కనే జలాశయం, ప్రభుత్వఆస్తులు, జనావాసాలుండగా మైనింగ్ ఎలా చేస్తారని.. గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టవద్దని.. అందుకు ప్రభుత్వం అనుమతులివ్వొద్దని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

puligutta
పులిగుట్ట
author img

By

Published : Mar 8, 2023, 1:40 PM IST

Updated : Mar 9, 2023, 9:36 AM IST

వివాదాస్పదంగా పులిగుట్ట మైనింగ్ లీజు వ్యవహారం

Puligutta Mining Lease controversy : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకులోని పులిగుట్ట.. వివాదాస్పదానికి అడ్డాగా మారింది. అక్కడ తెల్ల రాయి కోసం జరగనున్న మైనింగ్‌పై స్థానికులు భగ్గుమంటున్నారు. ఇటీవల గ్రామస్తులు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. మైనింగ్ కోసం లీజుకిచ్చిన గుట్టకు ఆనుకునే రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకం రెండోదశ కింద చేపట్టిన ఏనుకుంట బాలన్సింగ్ రిజర్వాయర్ ఉంది. గుట్టను ఆనుకొని నీళ్లు నిల్వ చేసేలా జలాశయం నిర్మించారు.

ప్రస్తుతం గుట్టపై మైనింగ్ చేపడితే జలాశయంలోని నీటి నిల్వకు ఇబ్బంది ఎదురవుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మైనింగ్ చేపట్టే పులిగుట్టకు ఆనుకునే మోడల్ స్కూల్, కస్తూరీబా పాఠశాల, సబ్‌స్టేషన్ నిర్మించారు. ప్రస్తుతం మైనింగ్‌కి అనుమతిస్తే కాలుష్యంతో పాటు ప్రభుత్వ ఆస్తులు దెబ్బతింటాయని.. స్థానికులు చెబుతున్నారు.

సర్వేనెంబర్ 20లో 32.12 ఎకరాల్లో 2002 నుంచి 2022 మార్చి వరకు పలుగురాళ్ల కోసం తవ్వకాలు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం 20ఏళ్లపాటు.. ఓ వ్యక్తికి లీజుకిచ్చింది. కానీ 20 ఏళ్లుగా అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగలేదు. గడువు ముగియండతో లీజును.. మరో 20 ఏళ్లపాటు పునరుద్దరించుకునేందుకు లీజుదారు వారసులు గనులశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. స్పందించిన అధికారులు అన్ని ధ్రువపత్రాల్ని 6నెలలలోపు సమర్పించాలని.. గత ఆగస్టులో ఆదేశించింది.

Mining At Puligutta In Vanaparthi: ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. ఈ మేరకు గనుల శాఖ లీజుదారునికి నోటీసులు జారీ చేశారు. 20 ఏళ్లలో అక్కడ జలాశయం సహా ప్రభుత్వ ఆస్తులు వెలిశాయి. ఈ తరుణంలో పులిగుట్టపై ప్రస్తుతం మైనింగ్‌కి అనుమతి ఇవ్వొద్దని గ్రామస్తులు అధికారుల్ని కోరుతున్నారు. తవ్వకాలు చేపడితే ఏర్పడే కాలుష్యం వల్ల జలాశయంలో మత్ససంపదకు.. నష్టం వాటిల్లుతోందని మత్సకారులు ఆందోళన చెందుతున్నారు.

నిబంధనల ప్రకారం జలాశయాలు, ప్రభుత్వ ఆస్తులు, భవనాలకు 50 మీటర్లలోపు, జనావాసాలకు 200మీటర్లలోపు ఎలాంటి మైనింగ్ చేయరాదు. కానీ మైనింగ్ చేపట్టే పులిగుట్ట సమీపంలోనే జలాశయం, ప్రభుత్వ విద్యాసంస్థలు, సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టడం సహా ప్రభుత్వ పనుల కోసం పక్కనే భూములు కేటాయించారు. నిబంధనలకు విరుద్ధంగా పులిగుట్టపై.. మైనింగ్‌కి ఎలా అనుమతిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి తెలుసుకొని మైనింగ్‌కి లీజుకివ్వాలే తప్ప ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఇవ్వరాదని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే గ్రామసభ తీర్మానం సహా పలు శాఖలకు గ్రామస్తులు ఫిర్యాదులు చేశారు. లీజు పునరుద్ధరించేందుకు పర్యావరణ అనుమతిచ్చే విషయంలో ప్రజాభిప్రాయం.. నిబంధనల ఉల్లంఘనలను అధికారులు తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. హరితహారంలో భాగంగా పెంచిన మొక్కలు నరికేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"సర్వే నంబర్​ 20ను గుట్టకు దూరంగా ఉన్నట్లు ఇది ఒక రిజర్వాయర్​లా కాకుండా కుంట లాగా చూపించి.. ఉన్నవి కూడా లేనట్లుగానే సృష్టించి లీజుకు తీసుకున్నారు. రిజర్వాయర్​కు ఆధారంగా ఉన్న గుట్టనే తవ్వతున్నారు. గుట్ట వెనుక భాగంలో మైనింగ్​ అనే పేరుతో నాటు బాంబులు పెట్టి పేల్చుతున్నారు. దీనివల్ల పిల్లలు, అందరికీ రాత్రి సమయంలో భయంగా ఉంటుంది. ఈ మైనింగ్​ వల్ల మత్స్య సంపదకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది." - స్థానికులు

ఇవీ చదవండి:

Last Updated : Mar 9, 2023, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.