ETV Bharat / state

Vegetables Cultivation: పెట్టుబడి వేలాయే.. రాబడి రాకపాయే.. రైతుకంట కన్నీరాయే.. - ts news

Vegetables Cultivation: ఆరుగాలం కష్టపడినా ఫలితం రాకపోవడంతో కూరగాయలు సాగు చేసిన అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వరి సాగు చేయవద్దని సూచించడంతో కూరగాయల సాగు వైపు మళ్లిన రైతులు ఏం చేయాలో దిక్కుతోచని అయోమయంలో పడ్డారు. దిగుబడి బాగానే ఉన్నా మార్కెట్లో కూరగాయల ధరలు లేకపోవడంతో తాము పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Vegetables Cultivation: పెట్టుబడి వేలాయే.. రాబడి రాకపాయే.. రైతుకంట కన్నీరాయే..

author img

By

Published : Feb 26, 2022, 6:48 PM IST

Vegetables Cultivation: ఎంతో కష్టపడి సాగు చేసుకున్న కూరగాయల పంటకు సరైన ధర మార్కెట్​లో లేకపోవడంతో కూరగాయలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వరి సాగు చేయవద్దని సూచించడంతో కూరగాయల సాగు వైపు మళ్లిన రైతులకు పండించిన పంటకు ధర లేకపోవడంతో తాము నష్టాల్లో ఉన్నామని వాపోతున్నారు. ఒక ఎకరం పొలంలో టమాట, మిర్చి, వంకాయ, కాకర, బీరా, చిక్కుడు లాంటి పంటలను సాగు చేసేందుకు 60 నుంచి 80 వేల వరకు ఖర్చు వచ్చిందని.. దిగుబడి బాగానే ఉన్నా మార్కెట్లో కూరగాయల ధరలు లేకపోవడంతో తాము పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన టమాటాలను ఎక్కువ రోజులు నిలువ చేసుకోవడానికి రావడం లేదని.. 1, 2 రోజులు ఉంటే మొత్తం పాడైపోతుందన్న భయంతో మార్కెట్లో అతి తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి దాపురించిందని పేర్కొంటున్నారు.

లాభం లేదు..

'వంకాయ, మిర్చి, బెండ, టమాట, చిక్కుడు, కాకర, సొరకాయ సాగు చేశా. కూరగాయలకు ధరలు లేక చాలా ఇబ్బందవుతోంది. సాగు కోసం 60 వేల వరకు పెట్టుబడి పెట్టిన.. కానీ ఇప్పటివరకు 20 వరకు కూడా రాబడి రాలేదు. అంతా దళారులు దోచుకుంటున్నారు. వనపర్తి మార్కెట్​కు పోతే 25 కిలోల టమాట బాక్స్​.. 100 లేదా 50 రూపాయలకు పోతోంది. ఏం లాభం లేదు.'

-మల్లయ్య, రైతు

దళారీ వ్యవస్థ దోచుకుంటోంది..

కూరగాయల మొక్కలను కొనుగోలు చేసే క్రమంలో ఒక్కో మొక్కకు 60 పైసల నుంచి రెండు రూపాయల దాకా చెల్లించి మొక్కలను కొనుగోలు చేశామని రైతులు పేర్కొంటున్నారు. వాటిని నాటేందుకు, బిందు సేద్యం పైపులు తదితర ఏర్పాట్ల కోసం 50-60వేలు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. కలుపు తీయడం, కూరగాయలను కోయడం, ఇతర అవసరాల కోసం మరో 20 నుంచి 30 వేల ఖర్చు చేయాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. 25 కేజీలు ఉండే ఒక బాక్సు టమాటాలను మార్కెట్​కు తీసుకువెళ్తే మార్కెట్లో ఉన్న దళారీ వ్యవస్థ కేవలం వంద రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని.. అందులోనూ వారి మార్కెట్ కమిషన్ కూడా వసూలు చేసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.

నర్సరీలు ఏర్పాటు చేయాలి..

'మేము 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాం. ప్రభుత్వం ధాన్యం కొనమని అనడంతో కూరగాయలు సాగుకు మళ్లినం. ప్రభుత్వం కూడా కూరగాయలు సాగు చేయాలని తెలపడంతో సాగు చేస్తున్నాం. సాగు చేసేందుకు నారు కొనాలంటే బాగా ఖర్చవుతోంది. కూరగాయల నారును కూడా సబ్సిడీపై రైతులకు అందించేందుకు ప్రత్యేక నర్సరీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.'

-లక్ష్మయ్య, రైతు

శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలి..

బెండ, కాకర, చిక్కుడు బీర లాంటి కూరగాయలకు కిలో 20 నుంచి 30, 40 రూపాయలు మాత్రమే వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కూరగాయలు పండించే రైతులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీ రుణాలు ఇవ్వాలని కోరుతున్నారు. కూరగాయలను నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం దృష్టి సారించాలి..

కూరగాయల నారును కూడా సబ్సిడీపై రైతులకు అందించేందుకు ప్రత్యేక నర్సరీలు ఏర్పాటు చేసి రైతులకు పంపిణీ చేస్తే కూరగాయల సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తారని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కూరగాయల సాగుచేసే రైతులకు కావలసిన సదుపాయాలపై దృష్టి సారించాలని వారు కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.