ETV Bharat / state

రైతులను కన్నీరు పెట్టిస్తోన్న అకాల వర్షాలు - pre mature rains

అకాల వర్షాలతో అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లుతోంది. ఆరుగాలం శ్రమించి.. పండించిన పంట వర్షార్పణం అవుతోంది. వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో.. ఇవాళ ఉదయం కురిసిన వర్షానికి కల్లాల్లోని పంటంతా నీట మునిగింది.

Premature rains causing losses
Premature rains causing losses
author img

By

Published : May 20, 2021, 11:13 AM IST

తెల్లవారు జామునే కురిసిన అకాల వర్షాలు.. వనపర్తి జిల్లా రైతులను నిండా ముంచాయి. కల్లాల్లోని వరి పంటను ధ్వంసం చేశాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట.. నీట పాలవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అకాల వర్షాల వల్ల తాము నష్టపోతున్నామని అన్నదాతలు వాపోయారు. పానగల్ కేంద్రం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 20 రోజుల కిందట మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యాన్ని తూకం వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండనకా, వాననకా కాపలా ఉన్నా.. తీరా నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రెట్టింపు ధరలతో సంచార రైతుబజార్‌లలో అడ్డగోలు దోపిడీ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.