ETV Bharat / state

ఇంటిని ఎత్తేస్తూ... సెల్లార్​ నిర్మిస్తా...! - ఇంటిని ఎత్తేస్తూ సెల్లార్​ నిర్మాణం

ఇల్లు కట్టాక మార్చుకోవాలంటే చాలా కష్టం. రోడ్డు కంటే దిగువకు ఉంటే పైకి ఎత్తలేం. మొత్తం కూల్చి కట్టుకోవడమే గతి అని అందరూ అనుకుంటారు. కానీ హర్యానాకు చెందిన ఓ ఏజెన్సీ... ఇళ్లు కూల్చకుండా.. ఇంటి ఎత్తును పైకి లేపుతామంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు చేపట్టిన ఈ సంస్థ.. ఇప్పుడు వనపర్తిలో ఓ ఇంటిని కొత్త రూపు తీసుకొస్తోంది.

ఇంటి నిర్మాణం
author img

By

Published : Jul 22, 2019, 3:50 PM IST

ఇంటిని ఎత్తేస్తూ... సెల్లార్​ నిర్మిస్తా...!

వనపర్తి జిల్లా కేంద్రంలో వెంకటేశ్ అనే దుకాణ దారుడు​ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తన భవనాన్ని 3 అడుగుల ఎత్తుకు లేపి కింద సెల్లార్​ నిర్మిస్తున్నాడు. హర్యానాకు చెందిన ఓ ఏజెన్సీకి ఈ పనులు చేపట్టింది. భవనం అడుగున జాకీలను ఏర్పాటు చేసి దశల వారీగా పైకి ఎత్తుతూ వస్తున్నారు.

ఖర్చు సగం...

భవనాన్ని పూర్తిగా తొలగించి కొత్తది నిర్మించాలంటే రూ. 40 లక్షలు ఖర్చవుతుంది. ఇంటిని లిఫ్ట్​ చేసే ఈ పరిజ్ఞానం ద్వారా రూ. 20 లక్షలతో పని పూర్తవుతుందని వెంకటేశ్ పేర్కొన్నాడు. అంతేకాక వ్యయప్రయాసలు పడాల్సిన పని లేదని చెబుతున్నాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగకరంగా ఉందని అంటున్నాడు.

20 ఏళ్లుగా చేస్తున్నాం

ఈ విధానం ద్వారా 20 ఏళ్లుగా ఇంటి నిర్మాణాలను పైకి ఎత్తడం చేస్తున్నామని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకూ దాదాపు వంద ఇళ్లు పైకి ఎత్తామని పేర్కొన్నారు. ఈ పద్ధతి వల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడవని అంటున్నారు.
ఇంటి ముఖచిత్రం మార్చాలనుకునే వారు దానిని పగలగొట్టకుండా స్థానచలనం చేసే ఈ విధానం ఎంతో బాగుంది కదూ...! మరెందుకు ఆలస్యం ఇంట్లో మార్పు చేయాలంటే మీరు కూడా ఈ పద్ధతి పాటించండి. తక్కువ ఖర్చుతో ఇల్లు పడగొట్టకుండా కట్టే దీని వల్ల అన్నీ ఉపయోగాలే మరి.

ఇదీ చూడండి : బొగత జలపాతం... ప్రకృతి రమణీయతకు నిలువుటద్దం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.