ETV Bharat / state

'పరిశుభ్రత బాధ్యత మున్సిపాలిటీలదే'

మున్సిపాల్టీలోని మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించే బాధ్యత మున్సిపల్ సిబ్బందిదేనని వనపర్తి జిల్లా కలెక్టర్​ శ్వేతా మహంతి అన్నారు. జిల్లాకేంద్రంలోని కమలానగర్​ వార్డులో ఆమె పర్యటించారు.

'పరిశుభ్రత బాధ్యత మున్సిపాలిటీలదే'
author img

By

Published : Aug 18, 2019, 9:47 AM IST

'పరిశుభ్రత బాధ్యత మున్సిపాలిటీలదే'

ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం వేయకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్​ కమిషనర్​ రజనీకాంత్​ రెడ్డిని వనపర్తి జిల్లా కలెక్టర్​ శ్వేతా మహంతి ఆదేశించారు. వనపర్తిలోని కమలానగర్​ వార్డులో పర్యటించి పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. మురుగు నీరు రోడ్డుపైకి చేరి అనారోగ్యం పాలవుతున్నామని కాలనీవాసులు పాలనాధికారికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన కలెక్టర్​ కాలనీ లేఅవుట్లు చూసి ప్రణాళిక ప్రకారం మురికి కాలువల నిర్మాణంపై తనకు సమాచారం అందించాలని మున్సిపల్​ కమిషనర్​ను కోరారు.

'పరిశుభ్రత బాధ్యత మున్సిపాలిటీలదే'

ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం వేయకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్​ కమిషనర్​ రజనీకాంత్​ రెడ్డిని వనపర్తి జిల్లా కలెక్టర్​ శ్వేతా మహంతి ఆదేశించారు. వనపర్తిలోని కమలానగర్​ వార్డులో పర్యటించి పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. మురుగు నీరు రోడ్డుపైకి చేరి అనారోగ్యం పాలవుతున్నామని కాలనీవాసులు పాలనాధికారికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన కలెక్టర్​ కాలనీ లేఅవుట్లు చూసి ప్రణాళిక ప్రకారం మురికి కాలువల నిర్మాణంపై తనకు సమాచారం అందించాలని మున్సిపల్​ కమిషనర్​ను కోరారు.

Intro:Tg_mbnr_14_17_collector_word_watch_on _sanitation_maintenance_ts10053Body:Tg_mbnr_14_17_collector_word_watch_on _sanitation_maintenance_ts10053Conclusion:Tg_mbnr_14_17_collector_word_watch_on_sanitation_maintenance_ts10053
మున్సిపాలిటీలోని మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించే బాధ్యత జవానుల దేనని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు.
శనివారం సాయంకాలం ఆమె వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కమలా నగర్ వార్డులో పర్యటించి పారిశుద్ధ్యాన్ని తనిఖీ చేశారు. వార్డులో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండటం , ఆ స్థలాలలో చెత్తా,చెదారాన్ని వేయటం, మురికి నీటిని అంతటిని ఖాళీ స్థలాల లోకి వదలటాన్ని గమనించిన కలెక్టర్ మురికి కాలువలన్నింటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, వార్డులో ఉన్న కచ్చ డ్రెయిన్ లను శుభ్రం చేయించాలని, కాళీ స్థలాలలో చెత్త చెదారం, నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్ రెడ్డిని ఆదేశించారు. అంతేకాక కమల నగర్ వార్డు పరిధిలో అనేక గృహాల ఎలివేషన్లు రోడ్డుపైకి వచ్చాయని, వాటన్నింటినీ తొలగించాలని, అలాగే అనుమతిలేకుండా ఏర్పాటుచేసిన సైన్ బోర్డులను తొలగించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా వార్డు ప్రజలు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ తమ వార్డులో సరైన మురికి కాలువలు లేనందువలన మురుగునీరు రోడ్డుపైన చేరటం, లేదా ఖాళీ స్థలాలు నిల్వ ఉండటం వల్ల దోమలు, ఈగలు చేరి అనారోగ్యం పాలవుతున్నామనీ, అంతేకాక పందుల బెడద కూడా ఉందని, అందువల్ల తమ కాలనీకి పెద్ద సైజు మురికి కాలువ నిర్మాణం చేపట్టి ఆ నీటిని దూరంగా పంపించే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇందుకు స్పందించిన కలెక్టర్ కమలనగర్ కాలనీ అనుమతి పొందిన లేఅవుట్లు, అలాగే ప్రస్తుతం ఉన్న గృహాలన్ని రెగ్యులరైజ్ అయినది లేనిది, ప్రణాళిక ప్రకారం మురికి కాలువల నిర్మాణం వీటన్నింటిపై తనకు సమాచారం ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ తో కోరారు.
వార్డు లో పర్యటన సందర్భంగా కొంతమంది గృహ యజమానులు తాగునీటిని ట్యాంకులలో నిల్వ ఉంచటం గమనించిన కలెక్టర్ వారితో మాట్లాడుతూ ఏవరంతకు వారు నీటిని ఎక్కువగా నిల్వ ఉంచటం వల్ల అందరికీ నీరు అందదని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చందాపూర్ రోడ్డులో పారిశుద్ధ్యాన్ని తనిఖీ చేశారు. చెత్త కారణంగా మురికి కాలువలో మురుగునీరు ప్రవహించకుండా ఉండిపోవడాన్ని గమనించిన కలెక్టర్ పక్కనే ఉన్న జవానుతో మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, ఈ బాధ్యత జవాన్ల దేనని అన్నారు. అంతేకాక వనపర్తి పట్టణం నుండి చంద్రపూర్ రోడ్డు వరకు హరితహారం కింద రహదారికి ఇరువైపులా మొక్కల నాటించాలని కమిషనర్ను ఆదేశించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.