ETV Bharat / state

చెరువును బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​గా మారుస్తాం: నిరంజన్​రెడ్డి - బుద్దారం చెరువును పరిశీలించిన మంత్రి

వనపర్తి జిల్లా బుద్దారం చెరువు ఎడమ, కుడి కాలువల నిర్మాణాలకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి భూమిపూజ చేశారు. పల్లెనిద్ర చేసిన మంత్రి ఉదయం నడుచుకుంటూ వెళ్లి గ్రామంలో సమస్యలపై ఆరా తీశారు. గ్రామ చెరువును త్వరలోనే బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​గా మారుస్తామన్నారు.

buddaram cheruvu
చెరువును బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​గా మారుస్తాం: నిరంజన్​రెడ్డి
author img

By

Published : Jan 2, 2021, 10:55 AM IST

బుద్దారం చెరువును త్వరలోనే బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​గా మారుస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి తెలిపారు. ఇక్కడి నుంచి 40 వేల ఎకరాలకు శాశ్వతంగా సాగునీరు అందించవచ్చని అన్నారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దారం గ్రామంలో మంత్రి పల్లెనిద్ర చేశారు. ఉదయం నడుచుకుంటూ వెళ్లిన మంత్రి చెరువు ఎడమ, కుడి కాలువల నిర్మాణాలకు భూమిపూజ చేశారు.

గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు అనుసంధానంగా ఉన్న చెరువు ద్వారా ఇప్పటికే గోపాలపేట, పెద్దమందడి, గణపురం, వనపర్తి మండలాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​కు సంబంధించిన నిర్మాణాలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.