ETV Bharat / state

మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : మంత్రి నిరంజన్​రెడ్డి - వనపర్తి జిల్లా రంగసముద్రం తాజా వార్తలు

రాష్ట్రంలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. తాజాగా వనపర్తి జిల్లా రంగసముద్రం జలాశయంలో మంత్రి నిరంజన్​రెడ్డి చేప పిల్లలను వదిలారు. మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి తెలిపారు.

minister Niranjan Reddy said Fishermen must grow financially
మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : నిరంజన్​రెడ్డి
author img

By

Published : Aug 9, 2020, 3:51 PM IST

మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండల కేంద్రంలోని రంగసముద్రం జలాశయంలో చేప పిల్లలను మంత్రి వదిలారు.

ప్రాజెక్టులో 5 లక్షల 40 వేల చేప పిల్లలు విడుదల చేసినట్లు ఆయన అన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వినీల రాణి, ఎంపీపీ గాయత్రి, జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, అధికారులు రెహమాన్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి : తెరాస ప్రభుత్వం ఆదివాసీల పట్ల వివక్ష చూపుతోంది: బండి సంజయ్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.