వాన నీటిపై ఆధారపడకుండా ప్రాజెక్టుల్లోని నీటితోనే సాగుచేసుకునే రోజులు త్వరలోనే వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో రాయితీ వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. తొమ్మిది వేల రూపాయల విలువ గల వేరుశనగ విత్తనాలను ఐదువేలకే ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. రాయితీ విత్తనాలు దుర్వినియోగం చేయకుండా వాడుకోవాలని హెచ్చరించారు. విత్తనాలు తీసుకునే రైతుల వివరాలు సేకరించి పొలాల్లో పంట వేశారో లేదోనన్న వివరాలు నమోదు చేయించే బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు.
- ఇదీ చూడండి : అంతర్జాతీయ అందాల పోటీలకు.. తెలుగమ్మాయి