ETV Bharat / state

ధాన్యం కొనుగోలులో దేశంలోనే అగ్రస్థానం

వనపర్తి జిల్లా కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు నాణ్యత ప్రమాణాలపై పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

ధాన్యం కొనుగోలులో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానం

author img

By

Published : Nov 8, 2020, 5:03 AM IST

ధాన్యం కొనుగోలులో తెలంగాణ... దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు నాణ్యత ప్రమాణాలపై పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఎట్టి పరిస్థితులలో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రావాలన్నారు. రైతు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన దగ్గర్నుంచి... ఖాతాలో డబ్బులు జమ అయ్యే వరకు అధికారులే పూర్తి బాధ్యత వహించాలని మంత్రి పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్​బాష, జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ అనిల్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి రేవతి, మార్కెటింగ్ శాఖ ఏడీ స్వరణ్ సింగ్, మార్క్​ఫెడ్ అధికారి విజయ్ కుమార్, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.