ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో ఓటు హక్కు కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్రంలోని తెరాస శ్రేణులు, కార్యక్తలతో పాటు డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. నవంబరు 6 వరకు ఓటు నమోదు ప్రక్రియ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలపై తెరాస కసరత్తు