వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో ఓ వ్యక్తి మనస్తాపం చెందిన ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బాలాఫిర్ అనే వ్యక్తి మటన్ విక్రయించి కుటుంబాన్ని పోషించుకునేవాడు. గత కొద్ది కాలంగా బాలాఫిర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గ్రామంలో కొంతమంది బాలాఫిర్కు కరోనా వచ్చిందని ప్రచారం చేశారు. ఆ దెబ్బకు బాలాఫిర్కు గిరాకీ తగ్గిపోయి.. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. మనస్తాపం చెందిన బాలాఫిర్ ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కరోనా వచ్చిందని పుకార్లు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య! - వనపర్తి జిల్లా వార్తలు
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి కరోనా వచ్చిందని ప్రచారం చేయడం వల్ల.. అతడు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా పానగల్ మండల పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ పెద్ద దిక్కు చనిపోవడంతో.. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
![కరోనా వచ్చిందని పుకార్లు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య! Man Suicide In Wanaparthy District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8706183-933-8706183-1599441759817.jpg?imwidth=3840)
కరోనా వచ్చిందని పుకార్లు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య!
వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో ఓ వ్యక్తి మనస్తాపం చెందిన ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బాలాఫిర్ అనే వ్యక్తి మటన్ విక్రయించి కుటుంబాన్ని పోషించుకునేవాడు. గత కొద్ది కాలంగా బాలాఫిర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గ్రామంలో కొంతమంది బాలాఫిర్కు కరోనా వచ్చిందని ప్రచారం చేశారు. ఆ దెబ్బకు బాలాఫిర్కు గిరాకీ తగ్గిపోయి.. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. మనస్తాపం చెందిన బాలాఫిర్ ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇదీ చదవండి: "నా సొరకాయలు పోయాయి సార్..!"