వనపర్తి జిల్లా గోపాలపేటకు చెందిన నరేందర్ గౌడ్ హైదరాబాద్లో ఇన్నోవా కారు నడుపుతూ జీవనం సాగించేవాడు. లాక్డౌన్ నేపథ్యంలో మూడు నెలల క్రితం సొంతూరుకు వచ్చి కుటుంబసభ్యులతో ఉంటున్నాడు.
ఏం జరిగిందంటే...
మంగళవారం రాత్రి 8 గంటలకు కారు తీసుకుని నరేందర్ బయటకు వెళ్లాడు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఆటోను ఢీకొట్టాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత బైక్ను ఢీ కొట్టాడు.
ఈ ఘటనతో భయపడిపోయి వేగాన్ని పెంచి రహదారిపైకి వెళ్లగా... వాహనం అదుపు తప్పి నీటి గుంతలో పడిపోయింది. నరేందర్ తీవ్రగాయాలతో అపస్మారక స్థితికి చేరుకోగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్ఐఆర్