ETV Bharat / state

దారిద్య్రాన్ని వదిలించేందుకు పొలికేక పెట్టాలే..! - kcr

కావాల్సినన్ని వనరులున్నా... సద్వినియోగం చేసుకోలేని దద్దమ్మలు.. దేశాన్ని ఇన్నేళ్లు పాలించారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రచార సభల్లో పాల్గొన్న ఆయన మోదీ, రాహుల్​పై విరుచుకుపడ్డారు.

పాలమూరు సభలో కేసీఆర్
author img

By

Published : Apr 1, 2019, 6:52 AM IST

పాలమూరు సభలో కేసీఆర్
దేశ ఆర్థిక, వ్యవసాయ విధానాలు, న్యాయ వ్యవస్థలో మార్పు అవసరమన్నారు సీఎం కేసీఆర్​. గుణాత్మక మార్పు కోసం అవసరమైతే జాతీయ పార్టీని స్థాపిస్తానని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని లోక్​సభ అభ్యర్థుల తరఫున వనపర్తి, మహబూబ్​నగర్​లో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో గులాబీ దళపతి పాల్గొన్నారు.

పొలికేక పెట్టాలే..!

దేశంలో 3 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 70వేల టీఎంసీల సాగునీరు అందుబాటులో ఉన్నా... వాటిని సద్వినియోగం చేసుకునే శక్తి భాజపా, కాంగ్రెస్​లకు లేదని సీఎం విమర్శించారు. 60 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటూ.. పబ్బం గడుతున్నాయని మండిపడ్డారు. ఈ దారిద్ర్యాన్ని వదిలించేందుకు ఎవరో ఒకరు పొలికేక పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి పగ్గాలు చేపట్టనుందని జోస్యం చెప్పారు.

ప్రధానిపై ఎదురుదాడి..

పాలమూరు సభలో ప్రధాని మోదీ తనపై చేసిన విమర్శలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానన్న మోదీ.. ప్రాజెక్టు నిధుల కోసం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎందుకు స్పందించలేదని ఎదురుదాడికి దిగారు. ఐదేళ్ల పాలనలో ప్రధాని దేశానికి చేసిందేమి లేదని విరుచుకుపడ్డారు. ఆసరా పింఛన్లకు కేంద్రం 200 కోట్లిస్తే... తెరాస సర్కారు 11వేల కోట్లు ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. ఎన్నికల్లో భాజపాకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.

ఆగంకావొద్దు..

ఎన్నికలొస్తే ఆగమాగం కావద్దన్న ముఖ్యమంత్రి... పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీల కూటమే దిల్లీని శాసిస్తుందన్నారు. కేసీఆర్ దేశరాజధానికి వస్తే తమ పీఠాలు కదులుతాయన్న భయంతో తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. 16 స్థానాలు గెలిస్తే జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తామన్నారు. తెరాస గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఎన్నికల తర్వాత దేశానికే ఆదర్శమయ్యే రెవిన్యూ చట్టాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

రెండు నియోజకవర్గాల సభలను మంత్రులు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్ పర్యవేక్షించగా... 13 నియోజక వర్గాల తెరాస శాసనసభ్యులు హాజరయ్యారు.

ఇవీ చూడండి:దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.