అకాల వర్షం వనపర్తి జిల్లాలోని పలు గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. అనపర్తి మండలం చిన్న గుంటపల్లి గ్రామంలోని ఐకేపీలో ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలాయి. చిట్యాల గ్రామ శివారులోని జ్యోతిరావు పూలే పాఠశాల సమీపంలో 33 కేవీ లైన్ విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వనపర్తి పట్టణంతోపాటు పెద్దమందడి ఖిల్లా, ఘణపురం, వనపర్తి మండలాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పామిరెడ్డిపల్లి గ్రామంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. దొడ్డ గుంటపల్లి గ్రామ శివారులో కురిసిన వడగళ్ల వానకు చేతికొచ్చే పంట పూర్తిగా నేల రాలిపోయింది.
వనపర్తి, పెద్దమందడి, గణపురం మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా.. కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై తెరాస నేతల ధ్వజం