వనపర్తి జిల్లా ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ యాస్మిన్భాష హాజరయ్యారు. దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ నుంచి 74 మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
కరోన కాలంలో వారు నిత్యావసరాలకై అవస్థలు పడకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. సరకులతోపాటు మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అమరేందర్, సంక్షేమ శాఖ జిల్లా అధికారి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్