GanapaSamudram: వనపర్తి జిల్లా ఘణపురంలోని గణపసముద్రం చెరువు పునరుద్ధరణతో పాటు జలాశయంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కాకతీయుల సామంతరాజు గోన గన్నారెడ్డి 13వ శతాబ్దంలో నిర్మించిన గణపసముద్రం చెరువు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోలేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మిషన్ కాకతీయలో భాగంగా మరమ్మతులు చేశారు. ఘణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా చెరువులోకి కృష్ణా జలాలను పారించడంతో 2018లో చెరువు అలుగు పారింది.
తాజాగా చెరువు అభివృద్ధి పనులతో పాటు జలాశయంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 44.70 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఘణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఖిల్లా ఘణపురం, అడ్డాకుల, మూసాపేట మండలాలలో 25 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. అందులో భాగంగా గణప సముద్రం రిజర్వాయర్ ద్వారా 10 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. గణపసముద్రం చెరువుకు నిధులు మంజూరు చేసినందుకు వ్యవసాయశాఖా మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: