వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలోని కామధేనుపల్లి చెరువులో నీరు పూర్తిగా అడుగంటి చేపలు మృత్యువాత పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం మత్య్సకారులకు సంవత్సరం క్రితం వారి జీవనాధారం కోసం ఇచ్చిన చేపలు చనిపోవటంతో మత్య్సకారుల బ్రతుకులు రోడ్డున పడ్డాయి. చేపలు పెరిగి అమ్ముకునే సమయంలో మృత్యువాత పడటంతో భారీ నష్టం జరిగిందని మత్స్యకారులు వాపోయారు. ఒక్కో చేప 5 నుంచి 6 కిలోల వరకు ఉంటాయని, ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా చేపలు బరువు పెరిగి మాకు లాభాలు వస్తుండేనని తెలిపారు.
వేసవికాలానికి తోడు రైతులు వారి పంటలు చివరి దశలో ఉండటం వల్ల మోటర్ల ద్వారా నీటిని తోడటంతో చెరువులో నీరు ఇంకి పోయింది. దీంతో చేపలన్ని నీరు లేక మృత్యువాత పడ్డాయి. చేపలు, దాణాతో కలిపి మెుత్తం 40 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, మత్య్సశాఖ తమను ఆదుకోవాలని మత్య్సకారులు కోరారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో వర్ష బీభత్సం... ట్రాఫిక్కు అంతరాయం