వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ… రైతులు రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్ పద్ధతిని ఏర్పాటు చేసిన నిర్వాహకులు… వాటిని సరిగ్గా పంపిణీ చేయడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. పెబ్బేరులో పీఎసీఎస్, ఐకేపీ, మార్కెటింగ్ శాఖల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. టోకెన్లు అందజేస్తూ ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో పెబ్బేరు, కంచిరావుపల్లి గ్రామాలకు టోకెన్లు పంపిణీ చేసే వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి ఒక్కరే ఉండటం వల్ల టోకెన్ పంపిణీలో జాప్యం జరుగతోందని స్థానిక ఎంపీపీ భర్త కురుమూర్తి తెలిపారు. ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని ఆయన నచ్చజెప్పడంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు.
ఇదీ చదవండి; రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్ తీవ్ర ప్రభావం