ఇవీ చూడండి: ప్రాజెక్టులకు రూ.30,500 కోట్ల రుణం
పంటకు నీళ్లిస్తారా 'లేక'చావమంటారా?
వనపర్తి గోపాల్ దిన్నె రిజర్వాయర్ నుంచి మోటార్లను తొలగించాలని అధికారులు రైతులను ఆదేశించగా.. పంటలు వేసుకున్న అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 20 రోజుల్లో పంట చేతికొచ్చే దశలో మోటార్లను తొలగించొద్దంటూ అధికారులపై ఆగ్రహించారు.
పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపాల్ దిన్నె రిజర్వాయర్ నుంచి వరిపంటకు రైతులు మోటార్ల ద్వారా సాగునీటిని ఎత్తి పోసుకుంటున్నారు. వేసవిలో తాగునీటి సమస్య నెలకొంటుందని మోటార్లను తీసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయటంతో ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుల మందు డబ్బాలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడతామని అధికారులను బెదిరించారు. తమ పంటలకు జూరాల నుంచి లేదా గోపాల్దిన్నె రిజర్వాయర్ నుంచి పంటలకు సాగునీరు అందించాలని అధికారులను కోరినా.. ససేమిరా అనటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమకు పంటలు సాగు చేసుకోవద్దని ముందు ఆదేశించినా పంటలు వేసుకునే వాళ్లం కాదని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని అన్నదాతలు అధికారులను కోరుతున్నారు.
ఇవీ చూడండి: ప్రాజెక్టులకు రూ.30,500 కోట్ల రుణం
Last Updated : Mar 16, 2019, 9:09 AM IST