వనపర్తి జిల్లా బుద్ధారంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల్లో ఉండే అన్ని సమస్యలను గుర్తించి వాటి పరిష్కరించుకోవాలన్నారు. ప్రణాళిక అమలుకు అందరూ సహకరించాలని కోరారు. పంచాయతీలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ 30 రోజుల ప్రణాళికను తయారు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి శ్వేతా మహంతి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు లోకనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్లో నలుగురు దొంగల అరెస్ట్