వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్ట్‌ను జిల్లా అధికారులు పరిశీలించారు. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా ఆటోమేటిక్ సైఫన్ విధానం కలిగిన ప్రాజెక్టుగా సరళాసాగర్ పేరొందింది. ప్రాముఖ్యత గల ఈ ప్రాజెక్టును పర్యటక కేంద్రంగా చేయాలన్న ప్రజలు అభీష్టం మేరకు.. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నివేదిక పంపించారు. ఈ క్రమంలో ప్రాజెక్టును పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయగల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జిల్లా అధికార బృందం ప్రాజెక్టును సందర్శించారు. సాధ్యాసాధ్యాలను అంచనావేసి పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కి అందిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : ఓ దాత... మీ సహృదయతే మా విధిరాత!