వనపర్తి జిల్లాను పోలియో రహితంగా మార్చడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.శ్రీనివాసులు కోరారు. జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారులకు చుక్కలు వేసి పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లాలో 400 కేంద్రాల్లో 1,600 సిబ్బందితో 53,375 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సౌభాగ్య లక్ష్మి, డీపీఓ బిక్షపతి, మద్దిలేటి ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ట్రామాకేర్ సెంటర్‌గా శామీర్‌పేట్ ఆస్పత్రి : ఈటల