వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష కొవిడ్ బారిన పడ్డారు. వారం రోజుల క్రితం కలెక్టర్ భర్తకు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్లో ఉండగా.. తాజాగా ఆమెకు కూడా లక్షణాలు కనిపించడంతో పరీక్ష నిర్వహించారు. టెస్టులో కలెక్టర్కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు డీఎంహెచ్ఓ శ్రీనివాసులు తెలిపారు.
కలెక్టర్ దంపతులు హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. బుధవారం వారిని పరామర్శించారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేదని శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో తగ్గుతోన్న కరోనా నిర్ధరణ పరీక్షలు