కరోనా రెండోదశ విజృంభణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు సూచించారు. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కరోనా నివారణ కోసం ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్ప్రెస్