ETV Bharat / state

కరోనా రోగుల పట్ల సానుకూలంగా ఉండాలి: కలెక్టర్​

author img

By

Published : Sep 12, 2020, 10:27 PM IST

వనపర్తి జిల్లా కేంద్రంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ భాషా ముఖ్య అతిథిగా పాల్గొని.. సభ్యులకు పలు సూచనలు చేశారు.

Collector Yasmin Bhasha participed in the Zp Plenary Session
కరోనా రోగుల పట్ల కర్కశత్వం విడనాడాలి: కలెక్టర్​

కరోనా రోగుల పట్ల కర్కశత్వం విడనాడాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా పేర్కొన్నారు. కొవిడ్ బాధితుల పట్ల గ్రామస్థులు సానుకూలంగా స్పందించేలా స్థానిక ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు. భేటీలో కరోనా పట్ల ప్రజాప్రతినిధులకు పలు సలహాలు, సూచనలు చేశారు.

గ్రామాల్లో కరోనా రోగులను చూసి గ్రామస్థులు భయపడుతున్నారని, మరణించిన వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుందని ప్రజాప్రతినిధులు కలెక్టర్​ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ వైద్య సదుపాయాలు సరిగా లేని నిరుపేదల పట్ల​ ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ప్లానింగ్, విజనింగ్, డిజైనింగ్​పై దృష్టి పెట్టండి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.