వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా పట్టణంలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు అందించారు. 60 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. పట్టణ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు కలెక్టర్ ధన్యావాదాలు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే రోడ్లు, ఇతర సదుపాయాలు అవసరమని వెల్లడించారు.
ప్రభుత్వం ఆదర్శ మున్సిపాలిటీలను ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ యార్డు నిర్మించేందుకు ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ‘పది’ పరీక్షల రద్దుకే మొగ్గు... ఇంటర్ ద్వితీయ పరీక్షల వాయిదా?