రైతులు సాంప్రదాయ వ్యవసాయానికి స్వస్తి చెప్పి కూరగాయల వైపు మొగ్గు చూపాలని వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. ఒకసారి కూరగాయలు సాగుచేసి చూస్తే ఆ పంటల వైపు వెళ్లరని పేర్కొన్నారు. సేంద్రియ ఎరువుల ఉత్పత్తిలో అధిక దిగుబడులు సాధించవచ్చనని సూచించారు.
సహకారం అందిస్తాం..
పెద్దమందడి మండలం చిన్న మందడిలో ఆధునిక పద్ధతిలో కూరగాయల సాగు చేసేందుకు ముందుకొచ్చిన 30 మందికి మొక్కలు పంపిణీ చేశారు. కూరగాయలు పండించే రైతులకు ఉద్యాన శాఖ నుంచి సహకారం అందిస్తామన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మెలకువలు, సలహాలు సూచిస్తారని పేర్కొన్నారు.
సంతోషం..
పెద్దమందడి మండలంలో కూరగాయల సాగుకు 100 మంది ముందుకు రావడం సంతోషం దాయకమని అభినందించారు. గ్రామంలోని నర్సరీలో మొక్కలు ఎండి పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకులతో తయారుచేసిన వర్మీ కంపోస్ట్‌ను పరిశీలించారు.
ఇదీ చూడండి: పసుపు బోర్డు ఆశలపై కేంద్రం నీళ్లు... మళ్లీ ఉద్యమానికి రైతులు సిద్ధం